పేద మహిళలకు చేయూత గా నిలిచే మహిళ పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి ఐ ఐ టి ఢిల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా ఈ ఏడాది ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ షిప్,అండ్ ఎంపవర్మెంట్ (WEE) అవార్డ్ ని మూడు విభాగాల్లో అందించాయి వీరిలో గోల్డెన్ అవార్డ్ విభాగంలో ఎంపికై పాతిక లక్షల నగదు బహుమతి అందుకుంది స్నేహల్ వర్మ. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన స్నేహల్ భూపాల్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్ మెంట్ లో ఎంబి ఎ పూర్తి చేసింది నేచర్ డాట్ అనే అంకుర్ సంస్థ స్థాపించింది.నీటి వనరులను కాపాడేందుకు సాంకేతికతను అభివృద్ధి చేసి తర్వాత ఉపాధి అవకాశాలు పెంచటం ఈ సంస్థ లక్ష్యం. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్ ఘడ్ కు చెందిన మహిళ మత్స్యకారులకు చేపల దిగుబడి, ఎగుమతుల విషయంలో అండగా నిలుస్తోందీ ఈ సంస్థ .
Categories