ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకొంటూ ఉంటారు. చక్కగా ఎర్రగా పండిన గోరింటాకుతో అరచేతులు పువ్వుల్లా ఉంటాయి. మొత్తగా గోరింటాకును రుబ్బుకొనేప్పుడుచింత పండు వేస్తారు. లేదా   రుబ్బేకా నిమ్మరసం పిండుతారు. లేదా పటిక ముక్క ,యూకలిప్టస్ నూనె కలిపినా గోరింటాకు పండితే చాలా ఎర్రగా కనిపిస్తుంది. చేతులు శుభ్రంగా కడుకొని కాస్తా యూకలిప్టస్ ఆయిల్ రాసుకొని మందంగా గోరింటాకు పెట్టుకొని ఓ నాలుగైదు గంటలు ఉంచుకొంటే చేతులు ఎర్రగా పండుతాయి. డిజైన్లు ఎన్నో ఉన్నాయి. మేహాంది డిజైన్లు ఇప్పుడు వేసే కళాకారులు కూడా ఉన్నారు. సంప్రదాయకంగా మాత్రం అరచేతిలో చిన్న బంతి ఇకు వేసుకొని గోరింటాకు పెట్టుకొనే అదే అందమైన డిజైన్ లా బావుంటుంది.

Leave a comment