ఏ సీజన్ అయినా ,పండుగైనా ,కాలేజీకైనా సాయంత్రం షికారైనా జీన్స్ తప్పించి అందంగా సౌకర్యంగా ఉండే డ్రస్ ఇంకొటి కనిపించదు. ఫ్యాషన్ ప్రపంచంలో జీన్స్ వెరైటీలు ఎన్నో వస్తున్నాయి. అమ్మాయిలు మాత్రం వంటికి కాస్త అతుక్కునేలా ఉండే స్కిన్నీ జీన్స్ ను ఇష్టపడుతారు. యాంకిల్స్ పైకి ఉండే సిగరెట్ జీన్స్ కూడా ఫ్యాషనే.నడుము కింద నుంచి పాదాల వరకు ఒకే వెడల్ప్ తో ఉంటాయని మోకళ్ళ పై వరకు టైట్ గా ఉండి అక్కడ నుంచి కాస్త వదులుగా కనబడే బూట్ కట్ జీన్స్ కూడా కంఫర్ట్ గా ఫ్యాషన్ గా ఉంటాయి. వాతావరణం ఎలా ఉన్నా సరే జీన్స్ తో అలా తేలిగ్గా వెళ్ళిపోవచ్చు.

Leave a comment