రుచిరా గుప్తా సీనియర్ జర్నలిస్ట్ 2002లో అప్నే ఆప్ ఉమెన్ వరల్డ్ వైడ్ సంస్థ స్థాపించి సెక్స్ వర్కర్స్ కోసం పని చేస్తోంది.కరోనా సమయంలో ఢిల్లీ రెడ్ లైట్ ఏరియా కిక్కిరిసి ఉన్న ఇళ్లలో జీవిస్తున్న సెక్స్ వర్కర్ కి ఆహారం ఇచ్చేందుకు గాను వన్ మిలియన్ మీల్స్ కి పిలుపు ఇచ్చింది రుచిర గుప్తా. బాస్మతి బియ్యం అమ్మకందారు ఇండియన్ గేట్ ఒక లారీ బియ్యం పంపారు.ఇంకొకరు 50వేల సానిటరీ ప్యాడ్స్ పంపారు.ఇంకెన్నో సాయం చేసే చేతులు ముందుకు వచ్చాయి ప్రతి సెక్స్ వర్కర్ కుటుంబానికి డ్రై రేషన్ ఇస్తున్నాం ముఖ్యమైన ఆహార వస్తువులు ఉన్న బ్యాగ్ ఇస్తున్నాం అంటోంది రుచిరా.ఈమె వెబ్ సైట్  Apne aap org నీ సంప్రదించి ఎవరైనా విరాళాలు ఇవ్వచ్చు.

Leave a comment