పసి పిల్లలకు వాడే బేబీ ఆయిల్ పెద్దవాళ్ళకి మంచిదే బేబీ ఆయిల్ లో శుద్ధి చేసిన మినరల్ నూనె పెట్రోలియం జెల్లీ వంటివి ఉంటాయి.చాలా తేలికైన నూనె ఇది స్నానం చేశాక చర్మం పొడిగా ఉన్నప్పుడు రాసుకుంటే మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది.ఎక్కువసేపు చర్మంపైన తేమ నిలిచి ఉంటుంది. కాళ్ళ పగుళ్ళకు రాత్రివేళ రాసుకుని పడుకుంటే సమస్య తగ్గుతుంది.కాళ్ళ కింద కనిపించే నల్లని వలయాలకు కూడా బేబీ ఆయిల్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది.నిద్రపోయే ముందర, కాళ్ళకింద,ఈ బేబీ ఆయిల్ తో నెమ్మదిగా మర్దన చేస్తే రక్తప్రసరణ సరిగా జరుగుతుంది.రాత్రంతా అలా వదిలేస్తే  నెమ్మదిగా గుండ్రని వలయాలు తగ్గిపోతాయి బేబీ ఆయిల్ లో ఉండే తేలికైన సువాసన స్వాంతన కలిగిస్తుంది

Leave a comment