తప్పకుండా చూడవలసిన సినిమాల్లో థప్పడ్ హిందీ మూవీ కూడా ఒకటి. అమృత విక్రం ఇద్దరు చక్కని దంపతులు. విక్రమ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఒక ప్రాజెక్ట్ చాలా విజయవంతంగా ముగించి లండన్ లో ఆఫీస్ లో బాస్ గా చేరేందుకు సెలక్ట్ అయి . ఆ సందర్బంగా ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తాడు. ఆ ఆనంద సందర్భంలో పార్టీకి వచ్చిన అతని పై ఆఫీసర్ లండన్ ఆఫీస్ లో విక్రమ్ కేవలం సి ఇ ఓ గానే పనిచేయాలని ఆయన వర్క్ సూపర్ వైజ్ చేసేందుకు ఇంకో పై ఆఫీసర్ ఉంటాడని చెపుతాడు. విక్రమ్ పై ఆఫీసర్ పైన మండి పడతాడు. ఇదంతా తనకు ఎందుకు చెప్పలేదని తనకు అనాయ్యం జరిగిందని సుపీరియర్ తో కొట్లాటకు దిగుతాడు. అమృత భర్తని ఆ గొడవ లోంచి బయటకు రమ్మని లాగుతుంది. అంతులేని కోపం తో ఆమె చెంప పైన కొడతాడు విక్రమ్. అందరిలో తనను అవమానించి కొట్టినందుకు అమృత విక్రమ్ తో విడిపోవాలని కోర్టుకు వెళుతోంది. భర్త చెంప దెబ్బ కొట్టే హక్కుతో ఉంటాడా? భార్య భరించ వలసిందేనా ? ఈ ప్రశ్నకు జవాబు. ఈ సినిమా.