Categories
ఇల్లంతా పరిమళ భరితంగా ఉంటే ఒత్తిడి మాయం అవుతుంది . కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన సెంటెడ్ వాక్స్ బ్యాగ్లు ఇలా సువాసనలు వెదజల్లేవే . పువ్వుల పరిమళం ,అత్తరు సువాసన కలిపిన ఈ బ్యాగ్లు ఎయిర్ ఫ్రెషనర్లు ,ఆరోమా ఉత్పత్తులకు కొత్త రూపం . ఆరోమా నూనెలు పూలు ,పండ్లు సుగంధ ద్రవ్యాల నుంచి తీసిన ఎక్సట్రాక్ట్స్ తో నేరుగా వాటిని కలిపిఈ బాగ్స్ తయారు చేస్తున్నారు . పువ్వులతో నిండిన రకరకాల సువాసనలు దొరికే ఈ సెంటెడ్ వాక్స్ బాగ్స్ ఇంట్లో మూలమూలల్లో ఉంచుకోవచ్చు . బీరువా ,బట్టలు,పుస్తకాలు ఆఫీసులు మనకు కావలసిన ప్రతి చోట వాటిని పెడితే హాయినిచ్చే సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి . అన్నట్లు వీటిని తయారు చేయటం ఎలాగూ హేప్పీ ఎన్నో వీడియోలు అందుబాటులో ఉన్నాయి . ఇంట్లో తేలిగ్గా తయారుచేసుకోవచ్చు