Categories
వంటల్లో రుచి కోసం చిన్న చిట్కాలు పాటిస్తే తినే వాళ్ళు మెచ్చుకోకుండ ఉండలేక పోతారు. వంటకం కారకర లాడాలంటే వేయించే పిండిలో కొంచెం వేడి నూనె కలపాలి కూర పల్చగా అయితే అందులో కొబ్బరి తురుము,లేదా పెసర రవ్వ కలపాలి. ఉప్పు ఎక్కువైతే బంగాళాదుంప ముక్కలు కోసి వేయచ్చు లేదా గోధుమ పిండి ఉండలు చేసి వేసి తర్వాత వడ్డించెప్పుడు తీసేయచ్చు. నువ్వుల్ని వాడే ముందర బాగా చేయాలి లేకపోతే అందులో వుండే సన్నని రాళ్ళు వంటల్ని పాడు చేస్తాయి. మైదా గట్టిగా కలపాలి. నీళ్ళు తగలగానే పచ్చిగా అయ్యె ప్రమాదం ఉంటుంది. బెల్లం పాకంలో మలినాలు పోవాలంటే కాసిని పాలు పోస్తే మలినాలు పైకి తేలుతాయి.