Categories
![పళ్ళు తినటం మంచిదే కానీ పళ్ళ రసాలు ఆరోగ్యం కావని చెపుతున్నారు శాస్త్రజ్ఞులు. గ్లాస్ జ్యూస్ కోసం నాలుగు పళ్ళు అవసరమైతే ఆ పళ్ళు జ్యూస్ తీయటం కన్నా తినటం బెటర్ అంటున్నారు. పెద్ద గ్లాస్ పళ్ళ రసంలో పోషకాల కన్నా క్యాలరీ లే ఎక్కువగా శరీరానికి అందుతాయి. అలాగే తేలికగా ఉంటుండీ కదా అని ప్యాక్ చేసిన జ్యూస్ టిన్ పైన లో ఫ్యాట్ అని రాసి ఉన్నప్పటికీ అది నిజం కాదని గ్రహించాలంటున్నారు. అంతే కాదు ప్యాక్ చేసి నిల్వ చేసిన జ్యూస్ లో ఏ ఏ ఫ్రూట్స్ ని కలిపారు నిల్వ ఉండేందుకు వాడిన రసాయనాలు రుచికోసం చేర్చిన చక్కర తక్కువ శాతంలో ఉప్పు ఇవన్నీ లెక్కలు చూడమంటున్నారు. ఒక గ్లాస్ తాజా ఆరెంజ్ జ్యూస్ ద్వారా 110 క్యాలరీలు లభిస్తే అదే తాజా ఆరెంజ్ ద్వారా 62.9 క్యాలరీలు లభిస్తాయి. తాజా ఆపిల్ ద్వారా 87. 9 క్యాలరీలు లభిస్తాయి. ఇదే సాఫ్ట్ డ్రింక్స్ ద్వారా 138 క్యాలరీలు లభిస్తాయట. మిగతా పండిన పండ్ల లో ఫైబర్ శాతం ఎంతో ఎక్కువగా ఉంటుందనీ ఆలా పండిన పండే రుచిగా ఆరోగ్యానికీ మేలు చేస్తుందనీ గ్రహించాలని సలహా ఇస్తున్నారు.](https://vanithavani.com/wp-content/uploads/2016/12/fruits-juices.jpg)
గ్రీన్ జ్యూస్ లా వాడకం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది ఇవి తాజాగా ఉండటం తో పాటు సేంద్రియమైనవి. జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. బరువు తగ్గించడంలో అద్భుతంగా తోడ్పడతాయి. కూరగాయల రసం శరీరంలో డిటాక్స్ గా చేస్తుంది. పచ్చని కూరగాయలు శరీరాన్ని ఆక్సిజన్ రేట్ చేస్తాయి. పళ్ళ రసాల తో పోలిస్తే గ్రీన్ జ్యూస్ లో చక్కెర తక్కువ. నీళ్లు ఫైబర్ ఎక్కువ. ద్రవరూపంలో ఉంటాయి కనుక సులభంగా జీర్ణం అవుతాయి. రుచికోసం కలిపే అల్లం, సైంధవలవణం, మిరియాలు, నిమ్మరసం మొదలైనవి జీర్ణక్రియకు మేలు చేస్తాయి. వీటిని ఆహారంతో మాత్రమే తీసుకోవాలి ఆహారానికి ప్రత్యామ్నాయం ఈ రసాలు కానేకావు.