ఛాతి నొప్పి అంటే ఛాతి భాగంలో వచ్చే నొప్పి. ఇలా రావటానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. వీటిల్లో గుండెలోని రక్తనాళాలు మూసుకుపోవడం వలన వొచ్చే నొప్పినే గుండె నొప్పి లేదా గుండె పోటు అంటాం.
ఒక వ్యక్తి ఛాతిలో నొప్పి అనే కంప్లయింట్ తో వచ్చినపుడు డాక్టర్ చేసే మొదటి పని ఏమంటే….
ఈ నొప్పికి కారణం గుండె రక్తనాళాలు మూసుకుపోవడం వలనేనా కాదా అని తెలుసుకోవటం. ఎందుకంటే ఛాతినొప్పి కి గల కారణాల్లో ప్రాణాంతకమైనది ఇదే. మొదట ఈ నొప్పి గుండెకు సంబంధించినదా కాదా అని తెలుసుకోవడంతోటే అసలైన ట్రీట్మెంట్ మొదలౌతుంది. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ నొప్పి దేనివలన వచ్చింది అనేది డాక్టరు తెలుసుకోవాలి.
దానికి డాక్టర్ లు చేసే అతి సింపుల్ టెస్ట్ ECG.
Ecg తో పాటు 2d echo , troponin T, or Troponin I వంటి పరీక్షలు కూడా జబ్బు తీవ్రతను తెలపడానికి, జబ్బు ఖచ్చితంగా ఉందని confirm చేయటానికి ఉపయోగపడతాయి.
కానీ వెను వెంటనే అవసరమయ్యే టెస్ట్ మాత్రం ECG. ఒక్క ECG ప్రాణాంతకమైన వ్యాధిని పట్టి ఇస్తుంది. డాక్టర్లు పేషంట్ అటెండర్లు త్వర పడటానికి ఉపయోగపడుతుంది. గుండె నొప్పి వచ్చినపుడు ఒక్క డాక్టర్ మాత్రమే ఉరుకులు పరుగులు పెట్టడం వలన లాభం ఉండదు. పేషెంట్ తో పాటు వచ్చే అటెండర్లు కూడా అలెర్ట్ గా ఉంటేనే సరైన పద్ధతి లో ట్రీట్మెంట్ జరగగలదు.
అందుకే గుండె నొప్పి పై ప్రాథమిక అవగాహన అందరికీ అవసరం.
డా. విరివింటి విరించి (కార్డియాలజిస్ట్)
+91 99486 16191