శిరోజాల విషయంలో ప్రత్యేకశ్రద్ద తీసుకుంటేనే అవి రాలిపోకుండా ఆరోగ్యంగా ఉంటాయి. కోకో బటర్ ను కరిగించి అందులో ఆల్మండ్ ఆయిల్ , లావెండర్ ఆయిల్ కలిపితే కండీషనర్ అవుతుంది. ఇది జుట్టు పాడవ్వకుండ కాపాడుతుంది. తగినంత మాయిశ్చరయిజర్ అంది జుట్టు ఊడదు. అలాగే అలోవేరా రసంలో నిమ్మరసం,పెప్పర్ మెంట్ ఆయిల్ కలిపి దీన్ని జుట్టుకు పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. రాత్రి పడుకోబోయే ముందర జుట్టు మొదళ్ళ నుంచి చివర దాకా బ్రష్ తో దువ్వాలి. సహజ నూనెలు కుదుళ్ళ నుంచి జుట్టు మొత్తానికి పట్టుకుంటాయి. కండీషనర్ ను చల్లని నీళ్ళలో కడిగేస్తే శిరోజాలు మెరుస్తాయి. జుట్టుకు కలర్ వేసుకుంటే సల్ఫర్ లేని షాంపూలు, కండీషనర్ వాడాలి. వీటిలో గాఢమైన డిటర్జంట్లు ఉండవు.

Leave a comment