ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనార్ధాలు తెలిసినా అంత తేలిగ్గా ప్లాస్టిక్ వాడకం మాత్రం తగ్గటం లేదు. ప్రపంచంలో ఏటా 50 వేల కోట్ల ప్లాస్టిక్‌ బ్యాగ్ ల వాడకం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఇరవై లక్షల క్యారీ బ్యాగులు షాపుల్లోంచి ఇళ్ళలోకి నడిచొస్తున్నాయి. నిమిషానికో ట్రక్కు ప్లాస్టిక్ చెత్త సముద్రంలోకి డంప్ అవుతుంది. నిజానికి మనం వాడే ప్లాస్టీక్ అంత ఆరోగ్యకరమైనదేం కాదు. 50 శాతం వాడి పారేసేవి రీ సైకిల్ చేసి మళ్ళి మళ్ళీ మన చేతిలోకి వచ్చేవే. ట్యాప్ లలో వచ్చే నీళ్ళలో అమెరికాలో 94 శాతం ఇండియాలో 86 శాతం ప్లాస్టిక్ అణువులను గుర్తించారట. ఎంత ప్రమాదమో తెలిసికూడా ప్లాస్టిక్ నిషేధ ప్రతిజ్ణ చేయకపోతే మనం మన పిల్లలు ప్రాణాంతక వ్యాదుల్లోకి నేరుగా జారిపోతున్నట్లే.

Leave a comment