ఏ  అనుభంధమైనా ఎప్పుడూ సెన్సిటివ్ గా ఉంటుంది. రెపరెపలాడే దీపానికి చేతులడ్డం పెట్టి కాపాడుకొన్నట్లు ప్రతిబందాన్ని కాపాడుకోవాలి. శృతిహాసన్ కూడా ఇదే చెపుతోంది. కాంప్రమైజ్ కాకపోతే జీవితం అస్తవ్యస్తం. ఎక్కడ రాజీపడాలో అక్కడ పడితేనే బావుంటుంది. బంధాలను కాపాడుకోవలిసిన విషయంలో రాజీపడాలి. గొప్పలకు పోతే ఆ  బంధం  తెగిపోతుంది. స్నేహంలో అయినా వివాహ బంధంలో అయినా ఒకప్పుడు రాజీలుండేవి. ఇప్పుడిలా లేవు కనుకనే విడిపోవటాలు ఎక్కువైపోతున్నాయి. ఒక చిన్న రాజీ వల్ల  బంధం నిలబడితే కట్టుబడాలి. లేదా ఆ బంధం వల్ల  జీవితాంతం ఇబ్బందుల పాలేనని  ఎప్పుడు రాజీల మాటే వద్దు. అంటోంది. రేలషన్ షిప్స్ గురించి శృతి హాసన్ మాట్లాడుతూ ఇప్పటిదంతా ఫాస్ట్ ఫుడ్ కల్చర్ చటుక్కున తినేయాలి. చిటుక్కున పనిలో పడిపోవాలి. అంతే వేగం బంధాలకు ప్రాధాన్యత ఇవ్వలేనంత వేగం. ఈజీగా లవ్ లో అసలు అంత సులువుగా విడిపోవటం మొత్తం మీద అసలు బంధాలకు విలువే లేకుండా పోతుంది అంటుందామె. ఎదిగే వయసులో మొత్తం చూసిందంతా ఇదే ఈ అమ్మాయి. మానవ సంబంధాలకు గురించి శృతి కంటే చక్కగా చెప్పగలిగేదెవరు ?

Leave a comment