నాజుగ్గా చక్కగా కనిపించాలని అందరికి కోరికే. లావుగా వున్న వాళ్ళకు కాస్త సన్నగా కనిపించాలన్న. ఫ్యాషన్ గానూ వుండాలనుకొన్న వేసుకొనే దుస్తుల్లో కొంత స్టయిల్ చూపించ వచ్చు. పొట్ట పై భాగం కాస్త బొద్దుగా కనిపిస్తూ వుంటే రెండు మూడు అంగుళాలు లూజ్ గా ఉండేవి వేసుకోవాలి. ఫ్యాంట్లు, లేహంగాలు నిండుగా కుచ్చుల్లు లేకుండా చూసుకుంటే బావుంటుంది. కుర్తీ విషయంలో ఇదే జాగ్రత్త, పటియాలా ఫ్యాంట్ల కన్నా చుడీదార్లే బాగుంటాయి. ఎంచుకొనే కుర్తీలు కూడా మోకాలి పై భాగం వచ్చేలా డిజైన్ చేయించుకోవాలి. పై నుంచి కింద వరకు కుర్తీ ఒకే లా కాకుండా కిందకి వస్తున్న కొద్ది వెడల్పుగా ఉండేలా చూసుకోవాలి. పెద్ద ప్రింట్లు కాకుండా చిన్న ప్రింట్లు ఉండేలా చూసుకోవాలి. సన్నని అంచున్న మెత్తని క్రేప్, షిఫాన్ చీరలు, ఎంబ్రాయిడరీ పనితనం వున్న చీరల్లో నాజూగ్గా సన్నగా కనిపిస్తారని ఫ్యాషన్ ఎక్స్ పర్ట్స్ చేఅప్పుతున్నారు.

Leave a comment