Heart attack ఒక్కో సారి అరిథ్మియాతోటే రావచ్చు. అలాంటి పేషెంట్ ఉన్నపళంగా కుప్పకూలటం జరుగుతుంది. అలా జరిగిన సెకన్లలో ప్రాణం కోల్పోవటం జరుగుతుంది. Major heart attack వచ్చి , గుండె కండరం ఎక్కువ భాగం డ్యామేజ్ అయితే ఈ అరిథ్మియాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. దాదాపు ఇటువంటి పేషంట్లను కాపాడలేం‌. కానీ ఇటువంటి పరిస్థితి రాకుండా నివారించవచ్చు. అంత అవేర్నెస్ మనదేశంలో లేదు.

ఒకవేళ హాస్పిటల్ లో అరిథ్మియా వస్తే డాక్టర్లు కరెంట్ షాక్ ఇవ్వటం, CPR చేయటం జరుగుతుంది. అలా చేసి సక్సెస్ ఐన కేసులు కోకొల్లలు. పేషెంట్ పూర్తిగా కుప్పకూలినపుడు పల్స్ కూడా దొరకదు. అలాంటి పేషెంట్ కి CPR చేస్తూ పల్స్ తీసుకువచ్చి గుండె పని చేసేలా చేయగలిగినపుడు ఆ డాక్టర్ల ఆనందం చెప్పేదిగా ఉండదు. అనుభవిస్తేనే తెలుస్తుంది. కొందరు డాక్టర్లు, సిస్టర్లు కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడి కష్ట పడితే కానీ ఆగిపోయిన గుండె మళ్ళీ పని చేయటం జరగదు. సక్సెస్ అవుతామా లేదా అనేది చెప్పలేం. కానీ శక్తి యుక్తులను ఉపయోగించి పని చేసే ఆ సందర్భాలు మరిచిపోలేనివిగా ఉంటాయి. అటువంటి సమయాల్లోనే డాక్టర్లు గా ఉన్నందుకు ఒకింత ఆనందం కలుగుతూ ఉంటుంది. కానీ హాస్పిటల్ లో కాక ఎక్కడో బయట పేషెంట్ కొల్లాప్స్ ఐతే ఏం చేయాలి?. కామన్ మ్యాన్ CPR ఎలా చేయాలి?. ఇది చెబితే అర్థం అయ్యే విషయం కాదు. ప్రాక్టికల్ గా చేయాలి. ఎందుకంటే చనిపోబోతున్న మనిషిని ధైర్యంగా ఫేస్ చేస్తూ ఒక క్రమ పద్దతిలో CPR చేయటం అనేది చెబితే రాదు. కామన్ మాన్ ఎలా CPR చేయాలో demonstration చేయటం అవసరం. వీడియో కూడా సరిపోదు. వర్క్ షాప్ వంటివి కావాలి. CPR వర్క్ షాప్ లు జరుగుతూ ఉంటాయి. వాటిని అటెండ్ కావాలనుకున్న వాళ్ళు కావచ్చు. వర్క్ షాప్ లలో ఒక డమ్మీ శరీరం మీద నేర్పుతారు. దీనిలో ముఖ్యంగా పేషంట్ ఛాతి మీద మన చేతులు ఉంచి క్రమ పద్ధతిలో చెస్ట్ మీద వత్తుతూ ఉండాలి. నిముషానికి వంద సార్లు వత్తాలి. వత్తినపుడు ఛాతి గోడ 5cm లు లోపలికి పోవాలి. అలా చేయాలంటే thrust అనేది ఎలా ఉండాలో తెలుసుకోవాలి.

కానీ రియల్ లైఫ్ లో అంత ఈజీ కాదు. ముసలి వ్యక్తికి CPR చేసేటపుడు ఎముకలు పటపటా విరిగిపోతుంటాయి. అటువంటి సందర్భంలో మనం ఆ వ్యక్తి వయసుకు గౌరవమివ్వాల్సి ఉంటుంది. మనిషి హుందాతనాన్ని గౌరవిస్తు అతడి శరీర గౌరవాన్ని కించపరిచేలా హీరోచితంగా cpr చేయటం అనైతికతకు వస్తుంది. ఐతే CPR ఎలా చేయాలో 1,2,3,4 steps లాగా తర్వాత తెలుసుకుందాం. కానీ ప్రాక్టికల్ గా వర్క్ షాప్ లు అటెండ్ కాకుంటే చదివితే వచ్చే జ్ఞానం వలన ఉపయోగం ఉండదు.

–డాక్టర్.విరివింటి.విరించి(కార్డియాలజిస్ట్)

Leave a comment