సాధారణంగా కొన్ని అలవాట్లు మనం అద్దెకు తెచ్చుకున్నవే. స్పూన్ తో, ఫోర్క్ లతో చేతికి ఏది అంటకుండా తినడం కూడా ఇలాంటిదే అల్పాహారం అయినా, భోజనమైనా చేత్తో తినటమే మంచిది. చేత్తో ఆహారం ముట్టుకోగానే మెదడుకు సంకేతం అందుతుంది. నోటిలో లాలాజలం ఊరుతుంది. చేత్తో ఆహారం తింటూ ఉండగానే మనం ఆహారం తింటున్నామన్న విషయాన్ని మెదడు మన పొట్టకు చెప్పేస్తుంది. ఈ సంకేతాలతో పొట్టలో జీర్ణ రాసాలు ఎంజైమ్స్ విదుదల అవ్వుతాయి. దీని వల్ల బాగా జీర్ణ శక్తి పెరుగుతుంది. ఎంత ఆహారం తినగలమో అన్న విషయం సరిగ్గా అంచనా వేయగలుగుతాము. అలాగే ఆహారం ప్లాస్టిక్ ప్లేట్ లో ప్లాస్టిక్ స్పూన్ తో అల్యూమినియం గరిటలు వాడుతూ తినడం కూడా అట క్షేమం కాదు. అవి వేడికి కొంత కరుగుతాయి. అందులో రసాయినాలు పొట్టలోకి చేరిపోతాయి. అందుకే ఇలాంటి సమస్యలు ఎవీ లేకుండా చేత్తోనే అన్నం తినటం మేలు కదా. కమ్మని పెరుగు అన్నంలో తియ్యని మామిడి పండు నంజుకొని చేత్తో ఎంజాయ్ చేస్తూ తినటానికి ఎంత ఖరీదైన ప్లాటినం స్పూన్ అయినా సరిపోలుతుందా?
Categories