వ్యాక్సిన్  వేయించుకొన్న తర్వాత రెండు రోజుల పాటు జ్వరం,వళ్ళు నొప్పులు కొందరిలో కనిపిస్తాయి ఈ ఇబ్బందులు రాకుండా కొన్ని పదార్ధాలు ఆహారంలో చేర్చుకోమంటున్నారు ఎక్సపర్ట్స్. పసుపు యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్,యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ వంటి సుగుణాలతో నిండి ఉంది కనుక వ్యాక్సిన్ వేయించుకునే ముందు నుంచి పసుపు వాడకం వంటకాల్లో పెంచాలి అలాగే అమినో యాసిడ్లు ఎంజైమ్ లు పుష్కలంగా ఉండే అల్లం కూడా ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించి ఒత్తిడిని వదిలిస్తుంది. సాయంత్రం వేళల్లో అల్లం టీ తాగితే మంచిది. ఆకుకూరల్లో సరిపడా పీచు విటమిన్-సి,ప్రో విటమిన్-ఎ,కెరోటి నాయిడ్లు ఫోలేట్,మాంగనీస్,ముఖ్యంగా విటమిన్-కె ఉంటుంది. ఈ పోషకాలతో మెటబాలిజం మెరుగై వ్యాక్సిన్ తదనంతర అలసట మటుమాయం అవుతోంది,వ్యాక్సిన్ తరువాత శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా చూసుకోవాలి నీటితో కూడిన పండ్లను తినాలి. పుచ్చ తర్భుజా వంటి పండ్లు చాలా మంచివి వ్యాక్సిన్ తర్వాత ఇబ్బందులు రాకుండా పూర్వపు హుషారు కోసం ఈ పదార్ధాలు నిత్యం వాడుకోవాలని చెపుతున్నారు డాక్టర్లు.

Leave a comment