కాంబోడియాలో పోయ్ పేట లో ఫో సోఫా అన్న యువతి ఖాళీ వాటర్ బాటిల్స్ తో అందమైన బాటిల్ పువ్వులు తయారు చేసింది .పోయ్ పేటకు పర్యాటకులు సంఖ్య  ఎక్కువ . ఎక్కడపడితే అక్కడ ఖాళీ బాటిల్స్ పడేస్తారు అలా పడేసిన ఖాళీ బాటిళ్లు సేకరించి ఫో సోఫా అందమైన బాటిల్ పూల దండలు తయారు చేసింది. లాక్ డౌన్ లో ఇంట్లోనే ఉండటం తో ఖాళీ సమయం మొత్తం వాటర్ బాటిళ్ల తో అలంకరణ వస్తువులు తయారు చేసింది. ఈ బాటిల్స్ తో చేసిన డ్రెస్ లు, పూల కుండీలు ఆన్ లైన్ లో ఉంచటంతో మంచి స్పందన వచ్చింది. లాక్ డౌన్ పూర్తయ్యే సరికి ఫో సోఫా బ్యూటీ ఉత్పత్తుల షాప్ ఖాళీ బాటిల్ పూల అలంకరణతో అదొక గార్డెన్ లాగా మారిపోయింది. ఈ షాప్ కు సందర్శకులు ఎక్కువ అయ్యారు అలాగే ఆ బాటిల్స్ ముందు ఫోటోలు తీయించుకొనే వారి సంఖ్య పెరిగింది . పర్యావరణానికి మేలు చేసే ఈ బాటిల్స్ పూల గురించి వీక్షకులు ప్రశంశలు పూల వర్షంలా కురుస్తున్నాయి. వేస్ట్ గా తీసి పడేసిన బాటిల్స్ తో ఫో సోఫా చేసిన పువ్వులు ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను తెచ్చిపెట్టాయి.

Leave a comment