Categories
పండ్లు,కూరగాయాలు కేవలం నలుపు రంగులోనే వస్తున్నాయి. ఈ కృష్ణ వర్ణపు వస్తువులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు ఎక్సపర్ట్స్. టమోటోలు,ముల్లంగి, క్యాప్సికామ్,మిరపకాయలు చివరకు బంగారు రంగుతో కనువిందు చేసే మొక్క జొన్న పొత్తులతో సహా అన్ని నల్లనివే. మన దేశంలోని మణిపూర్ లో నల్లని బియ్యం పండుతున్నాయి. ఇండోనేషియా,ఆఫ్రికా దేశాల్లో ఈ నల్లని వర్ణపు కూరగాయలు ,పండ్లు పండిస్తున్నారు.ఈ రంగే కాదు,వీటి లోని పోషకాలు అద్భుతమే.