Categories
Nemalika

హద్దులు దాటితే అంతా నష్టమే.

నీహారికా,

ఏ బంధవ్యంలో అయినా మొట్ట మొదట గుర్తు పెట్టుకోవలసింది. ఒకరి రహస్యాలు ఇంకోళ్ళకి చెప్పకూడదు అని. అప్పుడే ఒక్కళ్ళపైన ఒక్కళ్ళకి నమ్మకం ఏర్పడుతుంది. అలా లేకపోతె అదసలు నమ్మకమేకాదు. ఒక్కసారి ఇద్దరి మధ్య ఏదైనా చిన్నపాటి గొడవ ఎదురైతే కుడాస్నేహంగా సభ్యతగా వున్నప్పుడు చెప్పుకున్న విషయాలు ఇంకొందరి ముందుకు తెచ్చి మాట్లాడకూడదు. సమస్య పరిష్కరించుకోవాలి లేదా సంబందం తెంచుకొందామనుకొన్నాసరే అంత వరకు ఆ స్నేహాన్ని డిలీట్ చేయాలి గానీ దాన్ని పెంచి రచ్చ చేసుకోగుడదు. స్నేహితుల మధ్యనో బంధువుల మద్యనో ఒక చొరవ వుంటుంది. ఆ చొరవతో కొందరు హద్దులు దాటి ఎదుటి వాళ్ళకు సంబందించిన సమస్తమైన వస్తువులు, దుస్తులు అనుమతి అడగకుండానే వాడేస్తుంతారు. కానీ ఇలా చేయడం వల్ల ఇప్పుడో ఒక సారి విసుగు తో మొత్తం బాంధవ్యాలే పోతాయి ఏ స్నేహనికైనా లిమిటేషన్స్ కావాలి. హద్దులు లేకపోతె స్నేహం కుడా భారమే అవుతుంది.

Leave a comment