నీహారికా

కొత్త సంవత్సరం రాబోతోంది. ఇంకా నాలుగు అడుగులే. ఇప్పుడు నీ ప్రశ్న జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ చావడులోనే పరిష్కారం ఎందుకు వెతుకుతున్నారు? అని సమాధానం తనను తానూ ప్రేమించే వ్యక్తి తనను తానూ ఎలా చంపుకుంటాడు ? అంటాడు జాషో. నిజమే. సకల సమస్యలకు మూలం భయం. నిరుద్యోగం ఆర్థిక సమస్య ప్రేమ వైఫల్యం విడాకులు ఆత్మీయుల మరణాలు నమ్మక ద్రోహాలు ఏదైనా కానీ. సమస్య తీవ్రత ఒక శాతం. మిగతా అంతా భయం. ఏ సమస్య పరిష్కించలేనంత క్లిష్టతరం కాదు. భయంతోనే మనిషిలో తెలివి తేటలు శక్తి సామర్ధ్యాలు మట్టికొట్టుకుపోతాయి. అప్పుడే పరిష్కారం ఒక్క బావే అన్న నిర్ణయానికి వస్తారు. ఇప్పుడు చెప్పు ఏదీ సాధించకుండా ఏ ఒక్క మంచి పనీ చేయకుండా ఏ ఒక్క జీవితాన్ని మార్చకుండా జీవితం వద్దనుకోవటం ఎంత వరకు న్యాయం. కఠిన పరీక్షలు పెట్టినప్పుడు వైమీ అనుకోకూడదు. ట్రై మీ …. అని సవాలు స్వీకరించాలి. సర్వస్వం  కోల్పోయినా భవిష్యత్తు ఒకటుంటుంది. అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో నెగ్గుకొస్తేనే సమర్ధుడైన నావికుడవుతాడు. ఎత్తు పల్లాలు ఎదుర్కుంటేనే మనిషి రాటుదేలుతారు. సమస్యల్లోనే సమర్ధత బయటపడుతుంది. ఇప్పుడు చెప్పు ప్రతి మనుషులు సమస్యల్ని ఎదుర్కునే ఇన్స్టింట్ సామర్ధ్యాలు ఉంటాయి. వాటని సమర్ధవంతంగా వాడుకుంటే చావు ఆలోచనలను చావు దెబ్బ తీయచ్చు. ఏమంటారు.

Leave a comment