Categories
WhatsApp

హెయిర్ డై తో రొమ్ము కాన్సర్.

తలకు వేసుకునే రంగుకు రొమ్ము కాన్సర్ కు సంబంధం ఉందంటున్నారు న్యుజెర్సీ పరిశోధకులు. హెయిర్ డై ల తో లేత రంగుల కన్నా ముదురు రంగులు ఎక్కువ హాని కలిగిస్తాయని వీరు చెప్పుతున్నారు. ఈ అధ్యాయినం ఆఫ్రికా, అమెరికాలో జరిగింది. మహిళల్లో సుదీర్ఘ కాలం పాటు జుట్టుకు ఉపయోగించే రంగు, రిలాక్సర్ల గురించి అడిగి తెలుకుకొన్నారు. వీటిల్లో ఎక్కువ మంది ముదురు రంగు ఉపయోగిస్తున్నారని లెక్కలు చెప్పాయి వీరిలో ఎక్కువ శాతం మందిలో కాన్సర్ లక్షణాలు వున్నాయని పరిశోధనలు తెల్పాయి. పైగా ఈ అలకు వేసుకునే రంగు వల్ల శిరోజాలకే కాకుండా శారీరక ఆరోగ్యం పైన కూడా ప్రభావం చుపెడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. నాచురల్ హెయిర్ డై ని వుపయోగించాలని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.

Leave a comment