జుట్టు రాలడమనేది ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య. అయితే వర్షాకాలంలో జుట్టు రాలడం సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఈ సీజన్‏లో ఎక్కువగా జుటు రాలిపోతుంటుంది. దీంతో ఎన్నో రకాల సప్లిమెంట్స్, కెమికల్ షాంపులు, రకరకాల ఆయిల్స్ ఉపయోగిస్తుంటారు. కానీ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. కొన్ని లక్షణాలను బట్టి శరీరంలోని ఏ లోపం వలన జుట్టు రాలుతుంది అనేది తెలుసుకోవాలి. వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోవడానికి కొన్ని కారణాలున్నాయి. వాతావరణంలో ఉంటే అధిక తేమ కారణంగా జుట్టు మూలాలు ఎక్కువగా హైడ్రోజన్‏ను గ్రహిస్తాయి. ఇది జుట్టును పెళుసుగా చేస్తుంది. దీంతో జుట్టు ఎక్కుగా రాలిపోతుంది. దీంతోపాటు.. తేమ కారణంగా జుట్టులోని సహజ నూనె లక్షణాలు తొలగిపోతాయి. రోజులో 50-100 వెంట్రుకలు రాలిపోతే అది సాధారణమని వైద్యులు చెబుతున్నారు. అలాగే వర్షాకాలంలో దీని ప్రభావం మరింత పెరుగుతుంది. దీంతో ప్రతి రోజూ 200 వెంట్రుకల వరకు రాలిపోయే అవకాశం ఉంటుంది.

Leave a comment