Categories
బరువు తగ్గించడం కోసం ఆహారంలో భాగంగా తింటున్న అవిసె గింజలు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రొటీన్లు ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు పీచు యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు పుష్కలంగా ఉన్నా అవిసెల నుంచి నూనె తీస్తుంటారు. ఈ నూనె జుట్టు కుదుళ్ళకు పట్టించి ఓ అరగంట ఆగి తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు ఊడదు ఇందులోని విటమిన్లు జుట్టు వేగంగా పెరిగేందుకు తోడ్పడతాయి. అవిసెలు తలలో రక్త ప్రసరణ వేగం పెంచి జుట్టు తెల్లబడకుండా చేస్తాయి. అవిసెలు పొడి రూపంలో ఆహారంలో తీసుకున్న ఇదే ఫలితం ఉంటుంది.