Categories
శిరోజాల సంరక్షణకు కొన్ని రకాల గాఢ తైలాలు తొడ్పడతాయని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. జోజోబా లావెండర్ థైమ్ వంటి నూనెల వల్ల జట్టు వేగంగా పెరుగుతోందట. పెప్పర్ మెంట్ నూనె వల్ల మరీ వేగంగా జుట్టు పెరుగుతోంది అంటున్నారు .ఇందులోని మెంథాల్ కారణంగా చర్మం లోపల రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీంతో రక్త ప్రసరణ మెరుగై శిరోజాలు వేగంగా పెరుగుతాయి. చమేలా రోజ్ మేరీ, సెజ్ వంటి ఔషధ నూనెల్లో కాస్త కొబ్బరి నూనె కలిపి వాడి చూడండి. ప్రయోజనం ఉంటుంది అంటున్నారు. గుండు చేయించిన మాడు పైన ఇవి వాడితే మరింత ప్రయోజనం ఉంటుందట.!