పనివత్తిడి, చుట్టూ వాతావరణం లో ఉన్న కరోనా కారణంగా తెచ్చి పెట్టుకుంటున్న ఏకాంతపు ఒత్తిడి నుంచి బయట పడాలంటే మన శరీరంలోని గ్రంథులు విడుదల చేసే హ్యాపీ హార్మోన్స్ పైన దృష్టి పెట్టాలంటున్నారు డాక్టర్లు.ఈ హ్యాపీ హార్మోన్ లు డోపమైన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్ మూడ్ ని క్రమబద్ధీకరిస్తాయి . ఇవి శరీరంలో విడుదల కావాలంటే చిన్న చిన్న చర్యలు చాలు. డోపమైన్ ఫీల్ గుడ్ హార్మోన్ అంటారు 10 నిమిషాల పాటు ప్రశాంతంగా మెడిటేషన్ చేసినా స్నేహితులు, కుటుంబ సభ్యులతో మనసారా నవ్వు కొన్న చక్కని సంగీతం విన్న చాలు ఈ ఫీల్ గుడ్ హార్మోన్ విడుదల అవుతోంది. వాకింగ్, సైక్లింగ్, జంపింగ్ వంటి సింపుల్ ఎక్సర్ సైజ్ చేసిన సంతోష పూరితమైన సెరోటోనిన్ విడుదలవుతోంది. సూర్యకిరణాలు తగిలేలా ఏ బాల్కనీ లో అయినా నిలబడి మెడిటేషన్, వాకింగ్ చేస్తే చాలు నొప్పి నుంచి ఒత్తిడి నుంచి విముక్తులను చేసే పనులు వ్యాయామం, సూర్యరశ్మి ఏదైనా కామెడీ కబుర్లు, సినిమాలు, స్పైసీగా ఉండే ఆహారం ఏదైనా సరే ఎండార్ఫిన్ విడుదలకు సహకరిస్తాయి. స్పైస్ లకు మెదడు ప్రతిస్పందించి ఎండార్ఫిన్ లు విడుదల కు ఉద్దీప్తం కలిగిస్తుంది ఇక ఆక్సిటోసిన్ ను లవ్ హార్మోన్ అంటారు. ఇష్టమైన ఏ పని చేసినా, పెంపుడు జంతువులతో గడిపిన, ఇష్టమైన వారితో కలిసి భోజనం చేసిన ఆక్సిటోసిన్ శరీరంలో విడుదలై సంతోషాన్ని కలిగిస్తుంది. రోజులో పదినిమిషాలు ప్రశాంతంగా వాకింగో,యోగా నో చేయటం మరచిపోవద్దు.
Categories