Categories
రోజంతా రకరకాల మూడ్స్ ఉండటం ఎవరికైనా అనుభవమే రోజంతా మంచి మూడ్ లో ఉండాలంటే ఎమోషన్ లకు నియంత్రణలో ఉండాలి. సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదల సక్రమంగా ఉంటే మంచి మూడ్ ఉంటుంది. ఈ హార్మోన్ నేరుగా ఆహారం ద్వారా లభించదు.ట్రిప్టోఫాన్ అనే ఎమినో యాసిడ్ మెదడులో సెరటోనిన్ గా మారుతుంది. ఆ ట్రిప్టోఫాన్ కోడిగుడ్లు, నట్స్, సీడ్స్, సాల్మన్ చేపలు వంటి ప్రోటీన్ పదార్థాల్లో లభిస్తుంది. వ్యాయామాలు చేసినప్పుడు రక్తంలో ట్రిప్టోఫాన్ విడుదలవుతుంది. సూర్యరశ్మి శరీరానికి తగులుతుంటే మెదడులో సెరటోనిన్ ఉత్పత్తి ఆరంభిస్తుంది.