ఎలా ఎప్పుడు మనస్సు నిండా సంతోషాన్ని నింపుకుని వుండాలా అన్న ప్రశ్నలు వస్తే సమాధానం పుస్తకాలే . పుస్తకాలు ఖచ్చితంగా ఆనందం ఇస్తాయి. ఏ పార్కులోకొ ఒక పుస్తకం పట్టుకుని వెళ్లి కూర్చుంటే చాలు. అలాగే కాఫీ తాగుతూ బుక్ చదువుతుంటే సంతోషమే సంతోషం తాజా గాలి, స్వాంతన కలిగించే కొన్ని పదాలు లేదా విషయాలు బాడ్ మూడ్ నుంచి బయట పడేస్తాయి. చిన్నప్పుడు ఇష్టపడ్డ పుస్తకం మళ్ళి మళ్ళి చదువుకున్నా సరే ఆనాటి జ్ఞాపకాలు చుట్టూ ఉంటాయి. నాన్ ఫిక్షన్ కంటే ఫిక్షన్ బావుంటుంది. పూర్తిగా లీనం చేసే మనల్ని ఎక్కడికో తీసుకుపోతాయి. అలాగే కొందరు మిత్రులను కలుపుకుని ప్రతి సాయంత్రం పుస్తకాల గురించి చక్కని డిస్కషన్ పెట్టుకున్నా చాలు కొత్త పుస్తకాల గురించి అవగాహన వస్తుంది.

Leave a comment