వయస్సు పెరిగే కొద్దీ శరీరం తీరు మారిపోతుంది. మోహంలో వయస్సు తలూకూ లక్షణాలు కనిపిస్తాయి. కానీ కొందరికి ముఖాలోని వయస్సు తెలియనివ్వవు. అసలు వయస్సు కన్నా ఐదేళ్ళు చిన్నగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ యవ్వన రహస్యం చక్కగా పోగాలిగితే నిద్రలో దాక్కుని వుంటుంది. నిద్రవల్ల లాభాలు ఒకటీ రెండూ కావు. సుఖంగా నిద్రపోవడం కుడా ఒక వరం. నిద్రలో శరీర లోపాలు సారి అవ్వుతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. తగినంత నిద్ర విశ్రాంతి కలవారిలో రక్త పోటు అదుపులో వుంటుంది. అలాగే మిగిలిన అంతర్గత అవయువాల పనితీరు సక్రమంగా వుంటుంది. సరిగా నిద్రపోలేని వారిలో వెలుగు వుండదు. చర్మం ఆరోగ్యంగా కనిపించదు. ముఖంపైన ముడతలు వస్తాయి. అసలు వయస్సు కన్నా ఏడేళ్ళు ఎక్కువ కనిపిస్తారు. కంటి నిండా నిద్ర పోగాలిగితేనే శరీరానికి విశ్రాంతి దొరికి ఫ్రెష్ గా ఉండేందుకు అవకాశం వుంటుంది. అలాంటప్పుడే మొహం అలసట తీరి వయస్సు కనబడకుండా యవ్వనంతో కళకళలాడుతుంది.
Categories