కాస్త దూరం నడిచినా అలసట అనిపించినా మగతగా వున్నా కాసేపు నడిచేసరికి విశ్రాంతి తీసుకోవాలని కాసేపు నిలబడి ఊపిరి పీల్చాలని అనిపిస్తే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గినట్లు తెలుసుకోమ్మంటున్నారు వైద్యులు. మందుల సంగతి అలా వుంచి హిమోగ్లోబిన్ పెంచుకోవాలి అంటే తాజా నెయ్యి, నెయ్యి తో చేసిన పదార్ధాలు తియ్యని పండ్లు పాలు, కూరగాయల సలాడ్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. క్యారెట్ కుడా హిమోగ్లోబిన్ శాతం పెంచుతుంది. భోజనం తర్వాత రెండు పండిన అరటి పండ్లు, బీట్ రూట్ కూర ఇవన్నీ మంచి ఫలితం ఇస్తాయి. ఈ ఒక్క విషయం లోనే కాదు, శరీరంలో ఏ ఖనిజమో ఏ విటమిన్ లోపమో వచ్చిన్నా ముందుగా మందుల సంగతి పక్కన పెట్టే ఏ పదార్ధాల్లో ఈ విటమిన్లు, ఖనిజాలు ఉంటాయో అవి డైట్ లో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
Categories