Categories
మానసిక సమస్యలు బావోద్వేగాలతో భాదపడేవాళ్ళు హెల్త్ యాప్స్ చూస్తూ ఉంటే ఈ రెండు సమస్యల నుంచి తేలిగ్గా విముక్తి పోందుతారు అంటున్నారు బర్మింగ్ హమ్ యూనివర్సిటీ పరిశోధకులు.600 మంది పైన ఆరు నెలలపాటు క్రమం తప్పకుండా అధ్యాయనం జరిపారు. వారి ఆహారపు అలవాట్లు సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటారు,సెల్ ఫోన్ యాప్ లు ఎంత చూస్తారు అన్ని విషయాలు ప్రతి రోజు రికార్డ్ చేస్తారు.హెల్త్ యాప్ లు ఫాలో అయ్యేవాళ్ళు మానసిక సమస్యలు లేకుండా భావోద్వేగాలు అదుపులో ఉంచుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. హెల్త్ యాప్ లు చూడటం వల్ల ప్రతి నిమిషం తమ ఆరోగ్యాన్ని ఆ యాప్ లో లభించే సమాచారంతో సరి చూసుకుంటూ ఆరోగ్యం పై శ్రద్ద పెట్టగలరని తేలింది.