బరువును తగ్గించగలిగే ఆహారపదార్ధాలు ఉన్నాయి వాటి పై దృష్టిపెట్టండి అంటున్నారు ఆహార నిపుణులు. ఊడికించిన కొడిగుడ్డులో ల్యూమిన్ అనే యాసిడ్ బరువు తగ్గించేందుకు సాయం చేస్తుంది. దానిమ్మ గింజలు ఎన్ని తిన్నా మంచిదే. ఇవి తింటే కడుపునిండిన ఫీలింగ్ వచ్చేసి ఆహారం తీసుకోవాలన్న కోరిక నశించిపోతుందట.అలాగే ఆలివ్ ఆయిల్ మోనో శాచ్యూరేటేడ్ ప్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని కాపాడుతుంది. చేపల్లో అసలు కొవ్వే ఉండదు. మాంసాల జోలికి పోకుండా చేపలు తింటే బరువు పెరిగే అవకాశమే లేదు. ఆకు కూరలో నీటి శాతం అధికంగా ఉండి కడుపు నిండినట్లు అనిపిస్తుంది.

Leave a comment