ఇప్పుడు మార్కెట్లో వెల్లుల్లి పౌడర్ కూడా దొరుకుతుంది. దీన్ని ఇంట్లోనే చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఒక అరకిలో వెల్లుల్లి రెబ్బలు వలచి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక కప్పు బొంబాయిరవ్వ బాండలి లో వేడెక్కే దాకా వేయించి అందులో వెల్లుల్లి ముక్కలు వేయించాలి.ముక్కలు బంగారు రంగు వచ్చేదాకా వేయించి జల్లిస్తే బొంబాయి రవ్వ తీసేయాలి. వేయించిన ముక్కల్ని మిక్సీ జార్ లో వేసి పొడిగా చేసుకొని ఆరనిచ్చి సీసాలో నిల్వ చేసుకోవచ్చు. చాలా కాలం నిల్వ ఉంటుంది.

Leave a comment