Categories
రోజుకు రెండు గంటలు ఆరు బయట ఆడే పిల్లల ఆరోగ్యం బావుంటుంది అంటున్నారు పరిశోధకులు. మానసిక విశ్లేషకురాలు జోస్నా ఫార్ట్యూన్ చిన్న పిల్లల పైన విశేషమైన అధ్యయనాలు నిర్వహించారు. వీటి ఆధారంగా 15 మినిట్ పేరెంటింగ్ బుక్స్ పేరుతో పుస్తకం రాశారు జోస్నా ఫార్ట్యూన్. ప్రకృతి లో పిల్లలు అనుబంధాన్ని పెంచితే వారిలో ఒత్తిడి, మానసిక ఆందోళన దూరం అవుతాయి. చదువు పైన ఏకాగ్రత పెరుగుతుంది. కండరాలు బలోపేతం అవుతాయి. ఎన్నో రకాల జీవ నైపుణ్యాల నేర్చుకుంటారు.