రీసైకిల్ చేసిన పూలతో అగరబత్తులు బయో లెదర్ తయారు చేయాలని ఆలోచన నాకు ఎంతో నచ్చింది. దీని వల్ల నదులు శుభ్రంగా ఉంటాయి. ఎంతోమంది మహిళలకు ఉపాధి దొరుకుతుంది. అందుకే ఫూల్.కో సంస్థ లో పెట్టుబడి పెట్టాను అంటున్నారు బాలీవుడ్ నటి అలియా భట్ దేశం మొత్తం మీద ఎనిమిది లక్షల టన్నుల పూల వ్యర్ధాలు నదుల్లో నీటి వనరుల్లో కలుస్తాయి వీటి పెంపకం లో వాడే రసాయనాలు పురుగుమందులు జల చారలకు ముప్పుగా మారుతున్నాయి 2017 లో అంకిత్ అగర్వాల్ ఫూల్.కో సంస్థ కు శ్రీకారం చుట్టారు ఆలయాల్లో వాడే పువ్వుల ను సేకరించి శుభ్రం చేసి వాటితో అగరబత్తులు తయారు చేస్తారు. మిగిలిన పదార్థంతో వర్మీ కంపోస్ట్ రూపొందిస్తారు ఈ పని తో పన్నెండు వందల గ్రామీణ కుటుంబాలకు ఈ సంస్థ ఆర్థిక ఆసరా కల్పిస్తోంది. ఇప్పుడు పూలతో శాస్త్రీయ పద్ధతి లో ఫ్లవర్ లెదర్ తయారు చేస్తున్నారు. ఈ సంస్థకే అలియా భట్ భాగస్వామిగా ఉన్నారు.

Leave a comment