మిక్సీలు, గ్రైండర్లు వచ్చాక గతం లో వాడిన రాతి రోళ్ళు కనిపించకుండా పోయాయి. మళ్ళీ ఆ పాత పద్ధతులు రోటి పచ్చళ్ళు విలువ యువతరం గ్రహించారు కనుకనే చిన్న మార్పులతో పాతకాలపు రోళ్ళు రోకళ్ళు కాస్త రూపం మార్చుకుని తిరిగి వచ్చాయి. సాధారణ గ్రానైట్ తో పాటు మార్బుల్, పాలరాయి, ఇత్తడి చెక్క రోళ్ళు మార్కెట్ లోకి వచ్చాయి. వీటిపైన చెక్కిన డిజైన్లు కూడా చూడముచ్చటగా ఉంటున్నాయి. కొద్దికొద్దిగా పచ్చడి నూరు కోగలిగే చెక్క రోళ్ళు, రోకలి చాలా బాగున్నాయి.మసాలాలు చేసుకునేందుకు, రోటి పచ్చళ్ళు కోసం మాత్రమే ఈ రోళ్ళు వంటింటికే అందం ఇచ్చేలా ఉన్నాయి.

Leave a comment