సోషల్ మీడియాలో జస్టిన్ బెట్మాన్ ని ‘పెబెల్ పికాసో’ అంటారు ఇతను సృష్టించే ఆర్ట్ వర్క్ చిత్రంగా ఉంటుంది. వందల వేల రంగురాళ్లు ఉపయోగించి బొమ్మలు సృష్టిస్తాడు. చిన్న రాళ్లనే ఉపయోగిస్తూ చక్కని వివరాలతో చిత్రాలను సహజ వాతావరణంలో సృష్టిస్తాడు. ఇవి కొన్ని గంటలే ఫోటో తీసుకొని ఆ బొమ్మని చెరిపేస్తాడు. ఎప్పుడూ రంగురాళ్లు వెదకటం కనబడే రాళ్లతో ఆలోచించడం అందులో సరైన ప్రదేశం ఎంచుకోవటం బొమ్మ రూపొందించటం చివరగా ఫోటో తీసి ఇంస్టాగ్రామ్ లో పెట్టడం ఇదే ఈ ఆర్టిస్ట్ ఆనందం. నాలుగు వందల ఏళ్ల క్రితం ఇరాన్ లో ఈ కళ రూపొందింది మొజాయిక్ మొక్కలతో మసీదుల్లో గొప్ప డిజైన్స్ సృష్టించే వాళ్ళు. ఇది జస్టిన్ దృష్టిలో పడ్డాక అతను ఈ రంగు రాళ్ల బొమ్మలు మొదలు పెట్టాడు.

Leave a comment