ఒకప్పుడు ఒక కాలంలో తెల్లని పువ్వుల్లాంటి అన్నం మాత్రమే ఆరోగ్యం అనుకునేవాళ్ళు . కానీ ఇప్పుడు ఆహారంలో నలుపు కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు మోడరన్ చెఫ్ లు. నల్లని కుకీస్, దోసే, మిల్క్ షేక్, బర్గర్, బ్రెడ్ ఇవన్నీ ఘనమైన ఆహారానికి ఉదాహరణలు రుచిలో ఏమాత్రం తేడా లేని అపురూపమైన పదార్థాలు. ఆరోగ్యం కోసం ఈ నల్లని రూపులో ఉండే వంటలు భోజనం కోసం ఏకంగా నల్లవరినే తినమంటున్నారు పరిశోధకులు. తెల్లగా మెరిసిపోతూ మల్లెపువ్వుల కనిపించే తెల్ల బియ్యం మాత్రమే బియ్యం అనుకుంటాం కానీ నల్లగా పొడుగ్గా ఉండే బ్లాక్ రైస్ కూడా ప్రాచీన కాలం నుంచి అందుబాటులో ఉంది. చైనా వియత్నం ఫిలిప్పీన్స్ బర్మా దేశ్ బంగ్లాదేశల్లో ఇది ప్రధాన ఆహారం కూడా. ఈశాన్య భారత రాష్ట్రాల్లో నల్ల వారి వినియోగం ఎక్కువే. ఈ నల్ల బియ్యానే ఇప్పుడూ శాస్త్రజ్ఞులు సూపర్ ఫుడ్ అంటున్నారు. ఈ బియ్యంలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్-ఇ ఎక్కువే. ఒక కప్పు బ్లాక్ రైస్ లో మూడు గ్రాముల ఫైబర్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ తో కూడిన ఆహారం కన్నా బ్లాక్ రైస్ అత్యుత్తమం. బ్లాక్ బెర్రీ లో కంటే అధికమైన ఆంథోనియనిన్స్ ఆక్సిడెంట్లు నల్ల బియ్యపు తవుడు లో దొరుకుతాయి. ఒబేసిటీ రానివ్వదు ఇందులోని పోషకాలు శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిస్తాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. నల్ల వరి సాగు కూడా రైతుకు చక్కని ఆదాయం తెచ్చిపెడుతుంది. నిండుగా పోషకాలతో పాటు చీడ పీడలు రానివ్వకుండా ఎలాంటి ఎరువుల సాయం లేకుండా పెరుగుతోంది. నీటి అవసరం తక్కువే మామూలు వరి సాగు సమయం 135 రోజులు అయితే నల్ల వరి పంట వంద రోజుల్లోనే దిగుబడి చేతికి వస్తుంది. నల్ల బియ్యపు గంజి తలకు పట్టిస్తే వెంట్రుకలు బలంగా అందంగా నిగనిగలాడుతూ ఉంటాయని ఈశాన్య రాష్ట్రాల మహిళల నమ్మకం ఈ బియ్యపు గంజి మొహాన్ని మెరిపిస్తుంది.
Categories