Categories
బాత్ టబ్ లో చేసే వేడినీటి స్నానం తో గుండె ఆరోగ్యంగా ఉంచుకోవచ్చుఅంటున్నారు పరిశోధకులు. వారంలో ఐదు రోజుల పాటు 12 నిమిషాల చొప్పున వేడి నీటి స్నానం చేయడం వల్ల గుండె కండరాలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం కావనీ, గుండె రక్త ప్రసరణ సక్రమంగా ఉండటంతో పాటు రక్త పోటు అదుపులో ఉంటుందని చెబుతున్నారు. ఇందుకోసం సుమారు ఎనిమిది వందల మంది స్త్రీ పురుషుల పై చేసిన అధ్యయనంలో గుండె ఆరోగ్యాన్ని పరిశీలిస్తే గుండె పనితీరు మునుపటి కంటే మెరుగ్గా ఉన్నదని గుర్తించారు.