ఉత్తర్ ప్రదేశ్ లోని బుజుర్వ్ బస్తి గ్రామ మొదటి మహిళ వర్ష సింగ్ లాక్ డౌన్ సంపూర్ణంగా అమలు పరచడంలో మంచి కృషి చేశారు. అంగన్ వాడి,ఎ ఎన్.ఎం ల సాయంతో ఇంటింటికీ తిరిగి కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు వివరించి వాటిని సరిగ్గ పాటించేలా శ్రద్ధ తీసుకొన్నారు ఫేస్ మాస్క్ లు కుడుతూ ఇతరుల చేత కుట్టిస్తూ ఇంటింటికీ పంచారు దాతల సాయం తీసుకొని పేదలు ,యువకులకు ఆహారం సమకూర్చారు. ఈ మెను జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం రోజు మోదీ ఎంతో మెచ్చుకొన్నారు. ఆమె చేస్తున్న కృషి కి ప్రశంసలు కురిపించారు.