Categories
హైహీల్స్ ఫ్యాషనే కాని విటితో నడిచేప్పుడు కాస్తా జాగ్రత్తగా ఉండాలి. కానీ కొత్తలో నున్నగా జారీ పోతుంటాయి. అప్పుడు కింది వైపు శాండ్ పేపర్ తో రాయాలి. ఇలా చేస్తే నడుస్తున్నప్పుడు పట్టువస్తుంంది. సాధన చేయాలి ముందు. ఇంట్లో కాసేపు ఏ పాటకైనా డ్యాన్స్ స్టెప్స్ వేస్తే అటు ఇటు తేలిగ్గా తిరుగుతూ నడవటం అలవాటు అవుతుంది. బరువు మొత్తం మడమ భాగంలో పడుతోంది. అందుకే మడమ కింద షూ ఇన్నర్స్ లేదంటే ఫూట్ ప్యాడ్ ఉపయోగించాలి. వాటివల్ల పాదాలు జారకుండా ఉంటాయి. ముందు భాగం వీలైనంత వరకు పాదాన్ని కప్పివుంచే చెప్పులే ఉయోగించాలి. ముందు వైపు షూలాగా ఉండే రకం ఎంచుకుంటే మధ్య వేలు ,నాలుగు వేల్లు కలిపి బ్యాండ్ ఎయిడ్ చుట్టి నడిచి చూస్తే సౌకర్యం తెలుస్తుంది.