నేను ఫ్యాషన్ పెద్దగా పట్టించుకోను.అది నా వీక్ నెస్.కానీ తెరమీద ట్రెండ్ కి తగ్గట్లే ఉండాలి కదా . సినిమా కోసం వేసుకోనే డ్రెస్ లు నాకే కొత్తగా అనిపిస్తూ, ఒక కాన్ఫిడెన్స్ పెంచుతాయి అంటోంది అనుష్క. ఇప్పుడు భాగమతి విజయంతో సంతోషంలో కొత్త కథలపై దృష్టి పెట్టానంటోంది ఆమె. నేను ఒకే సారి రెండు , మూడు విషయాలపై మనసు పెట్టలేను. చాలా మంది అలవోకగా పనులు చేస్తూపోతారు నాకది చేతకాదు . చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నా శైలిలో నేను ముందుకు నడుస్తా ఈ అలవాటు వల్ల ఒకే పనిపై పూర్థి స్థాయి మనసు కేంద్రీకరించే వీలు దక్కుతుంది దాని వల్ల చేస్తున్న పనిలో మరింత పరిపూర్ణత సాధ్యమౌతోందనుకొంటున్నాను అంటుంది అనుష్క. అది నిజమే కావచ్చు దేన్నైయినా పర్ ఫెక్ట్ గా చేసే అలవాటు మంచిదే.

Leave a comment