నిర్మొహమాటంగా మాట్లాడటం ఒక విధంగా చాలా కష్టం. కానీ బాలీవుడ్ అగ్రతార మటుకు ఇలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా హాయిగా మనసులో ఉన్న మాట అనేసేంత ధైర్య శాలి. చాలా మంది తారలు హాలీవుడ్ సినిమాల్లో పనిచేయటం గర్వంగా ఫీలవుతుంటే కంగనా రనౌత్  మాత్రం అంత దండగ పని మరొకటి లేదండి డిజిటల్ మీడియా కారణం అక్కడి థియేటర్ బిజినెస్ చాలా దెబ్బతింది. 15 ఏళ్ల క్రితం హాలీవుడ్ బాగానే వుంది. కానీ ఇప్పుడు మన ఎంటర్ టైన్మెంట్ రంగమే లాభదాయకంగా ఉంది. మన చిత్ర సీమకే ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని కుండ బద్దలు కొట్టేసిందీ  అమ్మాయి. జంగిల్ బుక్ లాంటి అమెరికన్ చిత్రం మన దేశంలో వంద కోట్ల రూపాయల వ్యాపారం చేసింది మన సినిమాలకు సరైన స్థాయిలు సినిమా హాళ్లు ఉంటే ఆ స్థాయి వసూళ్లు సాధించటం పెద్ద కష్టం కాదు. ప్రపంచ సినిమా బాగు పడాలని కోరుకుంటాం. కానీ మన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందితేనే కదా ఇక్కడి వాళ్లకు ఉపాధి. అని అభిప్రాయ పడింది. అలాగే నేనయితే హాలీవుడ్ కు వెళ్లకే  వెళ్లనంది కంగనా .

Leave a comment