ఇప్పుడున్న వాతావరణం,కరోనా నేపథ్యంలో ఫిట్నెస్ కోసం జిమ్ లకు వెళ్లటం సహవాసం చేయటమే.ఇంట్లో పని తోనే కేలరీలు కరిగించుకోండి  అంటున్నారు నిపుణులు.ఏ పని చేస్తే ఎన్ని క్యాలరీలు కరిగిపోతాయో లెక్క చెబుతున్నారు. ఇంట్లో మూల మూలలా ఉన్న దుమ్ము దులపటం ఒక రకంగా స్ట్రెచింగ్  లాంటిది దీనితో కండరాలు దృఢంగా అవుతాయి .ఈ పని చేస్తే గంటకు 166 కేలరీలు ఖర్చవుతాయి. ఇల్లు  వుడిస్తే భుజాలు అటూ ఇటూ తిప్పాలి ముందుకు వంగి పని చేయాలి ఇలా చేస్తే భుజాలు మోకాలు తుంటి ఎముకలు బలంగా అవుతాయి.161 కేలరీలు ఖర్చుయిపోతాయి.ఇక బట్టలు ఉతకటం భుజాలకు చేతులకు వ్యాయామం.ఈ పని చేస్తే గంటకు 320 క్యాలరీలు ఖర్చయి పోతాయి.ఇంటిపనితో క్యాలరీలు కరిగిపోతాయి ఇల్లు శుభ్ర పడిపోతుంది .

Leave a comment