టాన్ లేదా మొహంపై నలుపు పేరుకుపోవటం చాలా మంది సమస్య పెసర పిండితో ఈ సమస్యను పోగొట్టవచ్చు.పెసరపిండిలో గులాబీ నీరు, రోజ్ ఆయిల్, పంచదార కలిపి పేస్ట్ లా చేసి ఈ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.పావుగంట తర్వాత తడి చేతులతో  మృదువుగా రుద్ది కడిగేయాలి.వారానికి రెండు సార్లు ఇలా చేస్తే పోతుంది. పెసర పిండి, తేనె, పెరుగు ప్యాక్  తో మొహం పై జిడ్డు పోతుంది. అలాగే పెసరపిండిలో గులాబీరేకులు ,పాలు కలిపి పేస్ట్ లాగా చేసి దానికి కాస్త బాత్ సాల్ట్ కలిపి ఒంటికి రుద్దుకుంటే చర్మం పైన పేరుకొన్న మురికి దుమ్ము,మృతకణాలు పోయి చర్మం మృదువుగా అయిపోతుంది.

Leave a comment