వర్షాల్లో చల్లని వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. శిరోజాలు పాడవకుండా ఈ కాలంలో వారానికి ఒక సరైన హెన్నా ప్యాక్ వేసుకోవాలి ఇది కండిషనింగ్ ఏజెంట్ గా పని చేసి జుట్టును మృదువుగా ఉంచుతుంది. ఐదు స్పూన్ల హెన్నా పొడికి రెండు స్పూన్ల డికాషన్ కోడిగుడ్డు తెల్లసొన, అర చెక్క నిమ్మరసం, స్పూన్ చొప్పున మెంతుల పొడి, ఉసిరి పొడి, పెరుగు కలిపి మూడు గంటలు నాననివ్వాలి. ఇందులో పావు స్పూన్ యూకలిప్టస్ నూనె కలిపి మెత్తగా పేస్ట్ లాగా కలిపి తలకు కుదుళ్ల నుంచి పట్టించాలి. అరగంట ఆరిపోయాక తలస్నానం చేస్తే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

Leave a comment