52 సంవత్సరాల సారా రాబిన్స్‌ కోల్‌ గత ఏడాది సెప్టెంబర్ 16న వందరోజుల డ్రస్ ఛాలెంజ్ తీసుకొని ఈ డిసెంబర్ 26 తో ముగించారు .అమెరికాలోని బోస్టన్ లో ఉండే సారా ఛాలెంజ్ మొదలు పెట్టిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అదే డ్రెస్ తో ఆఫీస్ కు, పార్టీలకు, షాపింగ్ కి వెళ్ళారు.అమెరికాలోని ప్రముఖ దుస్తుల కంపెనీ ఊల్‌ వందరోజుల డ్రస్ ఛాలెంజ్ మొదలుపెట్టింది. వంద రోజులు ఒకే డ్రెస్ ధరించటం ద్వారా షాపింగ్ లాండ్రీ ఖర్చు తగ్గుతుంది. అలా ధరించిన వారికి 100 అమెరికన్ డాలర్లు నగదు బహుమతి ఉంది.

Leave a comment