ఇవ్వాల్టి అమ్మాయిలకు గాజుల కంటే బ్రాస్ లెట్స్ ధరించడం ఇష్టం. ఫ్యాషన్ బుల్ గా కనిపింఛడం కోసం ఉంగరాన్ని,బ్రాస్ లెట్ ని కలుపుతు రింగ్ బ్రాస్ లెట్ లు రూపోందించారు డిజైనర్లు.ఇవి వేడుకలప్పుడు ధరించేందుకు వీలుగా ఉంటాయి.మణికట్టు నుంచి వేళ్ళ వరకు ఒకే నగ ధరించినట్లు ఉండటంతో ఇక చేతికి ఏ అలంకరణలు అక్కర్లేదు.ఖరీదైన రత్నాలు పొదిగిన ఈ రింగ్ బ్రాస్ లెట్లు పూలు,తీగలు,నెమళ్ళు రకరకాల డిజైన్లతో వస్తున్నాయి.బంగారంతో పాటు ఇమిటేషన్ నగలు ఈ తరహాలో రూపోందిస్తున్నారు.

Leave a comment