మంచి అమ్మాలు, మంచి కొడుకులు ఎప్పుడు ఉన్నారు. బెంగాళూరులో ఉండే కృష్ణ కుమార్ ఏ తల్లి అయినా కోరుకునే కొడుకు .పల్లెటూరులో భర్త పోయాక వంటరిగా నివశిస్తున్న తల్లి తీర్ధయాత్రలు చేయాలని ఉంది అన్నదట మాటవరసకి. కానీ కొడుకు దీన్ని సీరియస్ గా తీసుకొన్నారు. మాతృసేవా సంకల్పయాత్ర తలపెట్టాడు. తన స్కూటర్ కు వాళ్ళమ్మ సుఖంగా కూర్చోనేలా సీటు ఏర్పాటు చేసి ఆవిడను తీసుకొని మొత్తం పాతికవేల మైళ్ళు ప్రయాణం చేసి ఏడు రాష్ట్రల్లో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ చూపెట్టాడట. మొత్తం ఏడు నెలల ఏడు రోజులు సాగింది ప్రయాణం . కర్నాటక ,కేరళ,తమిళనాడు,తెలంగాణ,ఏపీ,మహారాష్ట్ర మొత్తం చుట్టేశారు తల్లీ కొడుకులు. ఇలాంటి గొప్ప అనుభవాన్ని తల్లికి కానుకగా ఇచ్చిన ఈ కొడుకు ప్రపంచంలో ఉన్న పిల్లల అందరికీ స్ఫూర్తీ దాత కదా!

Leave a comment