ఈ రోజుల్లో కూడా ఇలాంటి అచారం ఉందంటే ఆశ్చర్యంగా దిగులుగా ఉంటుంది.నెలసరి ,ప్రసవం ఏది జరిగిన ఆడవాళ్ళు ఇంట్లోకి వచ్చే వీలుండదు. కొన్ని ఊర్లలో ఇది అరిస్టం. అంచేత ప్రసవం అయినా మొదటి ఐదురోజులూ నెలసరి వచ్చిన ఐదురోజులు,లేదా మూడు రోజులు ఊరి బయట ప్రత్యేకంగా వేసిన గుడిసెల్లో కాలక్షేపం చేయవలసిందే. ఈ గుడిసెలను మట్టు గుడిసెలు అంటారు. ఇందులో ఉన్నన్ని రోజులు వండుకు తినేందుకు బియ్యం కొన్ని సరుకులు ఉంటాయి. స్త్రీలు ఎవ్వరికి కనిపించకుండా వంటరిగా , ఈ గుడిసెల్లో గడపాలి.ఎక్కడో ప్రపంచం అవతలిది కాదు ఈ ఆచారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని ఊరినాయనపల్లి కొత్తూరు సలార్ల పల్లి ,పాళ్యం ,తమిళనాడులోని ఏకళ నత్తవ పుంగుర్తి ఇంకా ఇలాంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. నెలసరి ,ప్రసవం వంటివి అపచారం అనుకోవటం ఇంకా ఇప్పటి రోజుల్లోనూ ఉండటం ఆశ్చర్యం.

Leave a comment